2019
మార్పు చెందడానికి ఎవరైనా ఒకరికి నేను సహాయము చేయగలనా?
2019 ఆగష్టు


చిత్రం
ministering

పరిచర్య సూత్రములు, 2019 ఆగష్టు

మార్పు చెందుటకు నేను ఎవరైనా ఒకరికి సహాయము చేయగలనా?

ఔను. కాని, మీ పాత్ర మీరు తలచిన దానికంటే వేరుగా నుండవచ్చును.

మనము మార్పు చెందగల సామర్థ్యముతో సృష్టింపబడియున్నాము. మన దైవిక సాధ్యత వైపు అభివృద్ది చెందుటయే మన మర్త్యానుభావము యొక్క ఉద్దేశము. ఇతరులు క్రీస్తు నొద్దకు చేరుటకు మరియు ఆయన సన్నిధికి తిరిగి చేరుకొనుటకు అవసరమైన మార్పులు చేయుటకు సహాయపడుట పరిచర్య చేయుటలో మన అంతిమ లక్ష్యాలలో ఒకటి. కాని క్రీస్తువలే ఎక్కువగా మారుటకు వారికిగల స్వేచ్చ వలన, వారికి సహాయపడుటలో మన పాత్ర పరిమితమైనది.

ఆయన వలె ఎక్కువగా మార్పు చెందుటకు ఇతరులకు వారి ప్రయత్నములలో మనము ఏవిధంగా సహాయపడగలము అను దానిపై రక్షకుని నుండి ఏడు శక్తివంతమైన పాఠములు ఇక్కడున్నాయి.

  1. మార్పు చెందమని ఆహ్వానించుటకు భయపడకుము

    పాత పద్ధతులను విడిచిపెట్టి ఆయన బోధలను హత్తుకోమని ఇతరులను ఆహ్వానించుటకు రక్షకుడు భయపడలేదు. పేతురును మరియు యాకోబును తమ వృత్తులను వదిలి “మనుష్యులను పట్టు జాలరులుగా మారుడని” (మార్కు 1:17) ఆయన ఆహ్వానించెను. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఆయన ఇలా ఆహ్వానించారు, “నీవు వెళ్లి ఇక పాపము చేయకుము” (యోహాను 8:11). లోక సంబంధమైన విషయములను విడిచిపెట్టి, ఆయనను వెంబడించుమని ధనవంతుడైన యువకుని ఆయన ఆహ్వానించారు (మార్కు 10:17-22) చూడుము). మార్పు చెందమని మరియు రక్షకుని వెంబడించమని ఇతరులను ఆహ్వానించునప్పుడు మనము కూడా ధైర్యముగాను మరియు ప్రేమ కలిగి ఉండగలము.

  2. మార్పు చెందుట వారి ఇష్టమని జ్ఞాపకముంచుకొనుము

    రక్షకుడు ఆహ్వానించే విధమైన మార్పు చెందుట నిర్భంధింపబడజాలదు. రక్షకుడు ఉపదేశించెను మరియు ఆహ్వానించెను, కాని ఆయన బలవంతము చేయలేదు. ఆ ధనికుడైన యువకుడు “వ్యసనపడుచు వెళ్లిపోయెను” (మత్తయి 19:22). కపెర్నహోమునందు ఆయన శిష్యులలో అనేకులు“వెనుక తీయుటకు” ఎన్నుకున్నారు, మరియు ఆయన మీరు కూడా వెళ్ళిపోవలెనని యున్నారా అని పన్నెండుమందిని అడిగెను (యోహాను 6:66-67చూడుము). బాప్తీస్మమిచ్చు యోహాను శిష్యులలో కొందరు రక్షకుని వెంబడించుటకు ఎన్నుకున్నారు, మిగిలినవారు కోరలేదు (యోహాను 1:35-37;10:40-42 చూడుము). ఆయనవలె ఎక్కువగా మారమని మనము ఇతరులను ఆహ్వానించగలము, కాని మార్పు చెందాలి అనే నిర్ణయమును వారి కొరకు మనము చేయలేము.మరియు మారాలని వారింకను కోరుకొనని యెడల, మనము విడిచిపెట్టరాదు—లేక మనము విఫలమైనట్లు భావింపరాదు.

  3. ఇతరులలో మార్పునొందగల సామర్థ్యము కొరకు ప్రార్ధన చేయుడి.

    యేసు తన శిష్యులు చెడు నుండి తప్పించబడి, ఆయన వలే, మరియు తండ్రి వలే ఎక్కువగా మార్పు చెంది, మరియు దేవుని ప్రేమతో నింపబడవలెను అని తన మధ్యవర్తిత్వ ప్రార్ధన యందు దేవుని అడిగెను (యోహాను 17:11, 21-23, 26 చూడుము). పేతురు తన పాత్రలోనికి ఎదుగుటకు అతని ప్రయత్నములందు బలము అవసరమని గ్రహించి, రక్షకుడు అతని కొరకు ప్రార్ధించెను (లూకా 22:32 చూడుము). ఇతరుల కొరకు మన ప్రార్ధనలు ఒక ప్రత్యేకతను చేయగలవు (యాకోబు 5:16 చూడుము).

  4. ఆయన శక్తిపై ఆధారపడుటకు వారికి బోధించుము

    రక్షకుని ద్వారా మాత్రమే మనము నిజముగా మార్పు చెంది మనందరం కలిగియున్న దైవిక శక్తి వైపు వృద్ధిచెందగలము. ఆయనే “మార్గమును, సత్యమును, మరియు జీవమును: (ఆయన) ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు” (యోహాను 14:6). ఆయన శక్తి “బలహీనమైన వాటిని బలమైనవిగా చేయగలదు” (ఈథర్ 12:27). ఆయన ప్రాయశ్చిత్తః శక్తియందు విశ్వాసమే చిన్నవాడైన ఆల్మా మారుటకు సాధ్యపరచెను (ఆల్మా36:16-23 చూడుము). ఇతరులు వారి జీవితాలలో ఆయన శుద్ధి చేయు శక్తిని కలిగియుండునట్లు రక్షకునిపై ఆధారపడమని మనము ఇతరులకు బోధించగలము.

  5. వారు కాగలరు అన్నట్లుగా వారిని చూడుము

    ప్రేమ మరియు అంగీకారము అనేవి మార్పు కొరకు శక్తివంతమైన ప్రతినిధులు కాగలవు. బావివద్దనున్న ఆ స్త్రీ తన భర్త కాని మనుష్యునితో కలిసి జీవించుచున్నది. యేసు శిష్యులు “ఆయన ఆ స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి” యోహాను 4:27, కాని యేసు ఆమె ఏ విధముగా మారగలదో దాని గురించి ఎక్కువ శ్రద్ధ వహించెను.ఆయన ఆమెకు బోధించి, ఆమె మారుటకు అవకాశము నిచ్చెను, ఆమె దానిని చేసింది. (యోహాను 4:4-42 చూడుము.)

    వారు ఏ విధముగా మారగలరో అనే దానికంటే ఇతరులు ఉన్నట్లుగా మనము వారిని చూసినప్పుడు మనము వారిని వెనుకకు నిలిపివేయగలము. బదులుగా, మనము గత పొరబాట్లను క్షమించి మరచిపోగలము. ఇతరులు మారగలరని మనము నమ్మగలము. మనము ఇతరుల బలహీనతలను చూడకుండా వారికై వారు చూడలేని మంచి గుణాలను ప్రత్యేకించి చూపించగలము. ”వ్యక్తులు వారున్నట్లుగా చూచుట కంటే, వారు కాగలరు అన్నట్లుగా వారిని చూచుటకు మనము బాధ్యత కలిగియున్నాము.”1

  6. వారిని తమ స్వంత వేగంలో వెళ్ళనివ్వండి

    మార్పు సమయమును తీసుకుంటుంది.మనమందరము తప్పనిసరిగా “పరిపూర్ణతను పొందువరకు ఓర్పుతో (మనము) కొనసాగవలెను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 67:13). యేసు ఇతరుల యెడల ఓర్పు కలిగి తన తండ్రిచేత అప్పగింపబడిన పాత్రను గూర్చి సాక్ష్యమిచ్చుచు, వారి ప్రశ్నలకు జవాబులిస్తూ ఆయనను వ్యతిరేకించు వారికి కూడా బోధించుట కొనసాగించెను (మత్తయి 12:1-13; యోహాను 7:28-29 చూడుము). మనము ఇతరుల యెడల ఓర్పు కలిగియుండి మరియు తమ యెడల తాము ఓర్పు కలిగియుండుటకు వారిని ప్రోత్సహించగలము.

  7. వారు పాత మార్గములలోనికి మరలిపోయిన యెడల మీ ప్రయత్నమును మానవద్దు

    యేసు మరణించిన తరువాత, పేతురు మరియు అపొస్తులులలో కొందరు వారికి అలవాటైన దానికి వెళ్ళిపోయిరి (యోహాను 21:3). అతడు “[తన] గొర్రెలను మేపవలెనని” (యోహాను 21:15-17 చూడుము), క్రీస్తు పేతురుకు జ్ఞాపకము చేసెను మరియు పేతురు పరిచర్య చేయుటకు తిరిగి వెళ్ళెను. పూర్వపు మార్గములలోనికి మరలిపోవుట చాలా సులభము కావచ్చును. రక్షకుని వెంబడించుటకును మరియు ఆయనవలేఎక్కువగా మార్పుచెందుటకు కృషి చేయవలెనని మృదువైన ప్రోత్సాహము మరియుప్రేరణాత్మక ఆహ్వానములతో మనము బలపరచుట కొనసాగించవచ్చును.

ఇతరులను ఎదగనియ్యుము

పన్నెండుమంది అపొస్తలుల సమూహములోని ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాల్లాండ్ ఇతరులను ఎదుగుటను అనుమతించుటను గూర్చి ఈ కథ చెప్పుచున్నారు: “అనేక సంవత్సరాలుగా తన పాఠశాలలో ఇంచుమించు అందరి యొక్క ఎగతాళికి గురియైన ఒక యువకుని గూర్చి నాకు చెప్పబడింది.అతనికి కొన్ని లోపములు ఉన్నాయి, కనుక అతనిని ఆటపట్టించడానికి తోటివారికి సులువుగా ఉండేది.తరువాత తన జీవితంలో అతడు దూరముగా వెళ్ళిపోయాడు. కాలక్రమంలో అతడు సైన్యంలో చేరాడు మరియు కొన్ని విజయవంతమైన అనుభవాలను పొందాడు, అక్కడ విద్యాభ్యాసము పొంది, గత జీవితంలో నుండి బయటికి వస్తున్నాడు. అన్నిటికి మించి, సైన్యంలో ఎక్కువమందివలే అతడు సంఘము యొక్క సౌందర్యమును, ఔన్నత్యమును తెలుసుకొని అందులో ఉత్సాహంగాను, సంతోషంగాను ఉన్నాడు.

“అప్పుడు, చాలా సంవత్సరాల తరువాత, అతడు తన యవ్వన కాలపు నగరానికి తిరిగి వచ్చాడు. అతడి తరములో అనేకమంది వలస వెళ్ళిపోయారు కాని అందరూ కాదు. ప్రత్యక్షంగా, అతడు చాలా విజయవంతుడై, పునర్జన్మించి తిరిగి వచ్చినప్పుడు, గతంలోని పాత మనస్తత్వం ఇంకను ఉండి, అతని రాక కోసం ఎదురుచూసెను. అతని స్వగ్రామంలోని ప్రజలకు, అతడు ఇంకా పాత ‘ఫలానా, ఫలానా, గానే ఉన్నాడు.’ …

“వెనుకబడిన పాత వాటిని విడిచి దేవుడు అతడి ముందుంచిన బహుమానమును తీసుకోమనిన పౌలు సూక్తిని అనుసరించిన ఈ మనిషి యొక్క ప్రయత్నము క్రమంగా క్షీణించి, చివరకు పూర్వము యవ్వనదశలోఅతడు ఉన్న స్థితిలోనే చనిపోయాడు…. అతని భవిష్యత్తు కంటే అతని గతం ఆసక్తికరమైనదని తలంచే వారి చేత అతడు మళ్ళీ చుట్టుముట్టబడటం అతని దుర్దశ, చాలా విచారకరమైన విషయం.క్రీస్తు అతడిని పట్టుకొనియున్న దానిని వారు అతడి చేతులలోనుండి చీల్చివేయగలిగారు. అతని స్వయంకృతాపరాధం చిన్నదైనా అతడు విచారముతో మరణించెను. …

మనుష్యులను (పశ్చాత్తాపపడనియ్యుడి) మనుష్యులను ఎదగనియ్యుము. మనుష్యులు మారగలరని, వృధ్ధిచెందగలరని నమ్ముడి..”2

వివరణలు

  1. థామస్-, ఎస్. మాన్సన్ “ఇతరులను వారు ఏ విధంగా మారగలరో చూడుడి,” లియహోనా, నవంబరు 2012, 70.

  2. జెఫ్రీ-, ఆర్. హాల్లాండ్, “అత్యుత్తమైనది ఇంకను రావలసియున్నది,” లియహోనా జనవరి 2010, 19, 20.

© హ్యారీ యాండర్ సన్/ఆ వ్యభిచారములో పట్టబడ్డ స్త్రీ/గుడ్సాల్ట్.కాం ; జీవజలము,సైమన్ డ్యుయీ; వివరాల నుండి వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా డేవిడ్ లిండ్ స్లీ