2021
నా జీవితంలో ప్రభువు స్వరమును నేను వింటున్నానని ఎలా తెలుసుకోగలను?
ఫిబ్రవరి 2021


“నా జీవితంలో ప్రభువు స్వరమును నేను వింటున్నానని ఎలా తెలుసుకోగలను?” (1)యౌవనుల బలము కొరకు, (2) ఫిబ్రవరి 2021, 29.

యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, ఫిబ్రవరి 2021

నేను ప్రభువు స్వరమును వింటున్నానని నా జీవితంలో ఎలా తెలుసుకోగలను?

చిత్రం
లేఖనములను చదువుచున్న యువకుడు

ఏ విధంగా యేసు క్రీస్తు మాటలను వినగలమో మరియు “మరింత బాగా, తరచుగా ఆయనను ఆలకించుటకు ఎటువంటి చర్యలు తీసుకోగలమో” మరియు “లోతుగాను మరియు తరచుగాను ఆలోచించమని” అధ్యక్షుడు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనల్ని ఆహ్వానించారు. (“‘How Do You #HearHim?’) A Special Invitation,” Feb. 26, 2020, blog.ChurchofJesusChrist.org).

లేఖనముల ద్వారా మరియు ప్రవక్తల మాటలద్వారా మనము ఆయనను ఆలకించగలము. కాని ఆ మాటలను వినుట లేక చదవడం మాత్రమే ముఖ్యమైనది కాదు. ప్రవక్త జోసెఫ్ స్మిత్ ద్వారా, ప్రభువు వివరించాడు:

“నా స్వరము మీతో ఈ మాటలను పలుకుచున్నది; ఏలయనగా అవి నా ఆత్మచేత మీకు అనుగ్రహించబడినవి … ;

“అందువలన, మీరు నా స్వరము విన్నారని సాక్ష్యమివ్వవచ్చు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 18:35–36).

అదనముగా, ఆయనను ఆలకించాలని కోరుట మనము దూకుడుగా చేసే పని కాదు. “దానికి మనస్ఫూర్తి, స్థిరమైన సంకల్పము కావలెను” అని అధ్యక్షుడు నెల్సన్ అన్నారు (“Hear Him,” ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశము [ఎన్సైన్ లేక లియహోనా, మే 2020, 89]).

మీరు అధ్యయనము, ప్రార్ధన, ఆరాధన, సేవ, చేస్తూ మరియు ప్రభువు ఆజ్ఞలకు లోబడినప్పుడు, ఆయన తన ఆత్మతో మిమ్మల్ని దీవించును మరియు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా మిమ్మల్ని మార్చును. అప్పుడు మీరు ఆయన స్వరము విన్నారని మీరు తెలుసుకోగలరు.