2023
గొర్రెల కాపరులు బాల యేసును దర్శించుట
2023 డిసెంబరు


“గొర్రెల కాపరులు బాల యేసును దర్శించుట,” ఫ్రెండ్, 2023 డిసెంబరు, 46–47.

ఫ్రెండ్ నెలవారీ సందేశం, 2023 డిసెంబరు

గొర్రెల కాపరులు బాల యేసును దర్శించుట

చిత్రం
alt text

ఏప్రిల్ స్టాట్ చేత వివరణ

ఒక రాత్రి, దేవదూత పొలములో గొర్రెల కాపరులను దర్శించెను. ఒక ప్రముఖుడైన బాలుడు జన్మించెనని ఆ దేవదూత వారికి చెప్పెను. ఆయన పేరు యేసు క్రీస్తు లోకములోని జనులందరికి ఆయన రక్షకుడగును. మరింత మంది దేవదూతలు వచ్చిరి. “సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, మరియు భూమి మీద శాంతి, మనుష్యులకు సమాధానము కలుగునుగాక.” అని వారు పాడిరి

చిత్రం
Alt text

ఆ గొర్రెలకాపరులు బాల యేసును దర్శించుటకు త్వరపడిరి. ఆయనను చూచి అత్యానంద పడిరి!

చిత్రం
Alt text

ఆ గొర్రెలకాపరులు యేసు క్రీస్తును గూర్చి ఇతరులకు చెప్పిరి. ఆ శుభ వార్త ప్రతి ఒక్కరు వినవలెనని కోరిరి.

రంగులువేసే పేజీ

యేసు క్రీస్తును గూర్చి నేను పాడగలను

చిత్రం
alt text here

ఏప్రిల్ స్కాట్ చేత వివరణ

యేసు జయంతి ఉత్సవమును జరుపుకొనుటకు నేను ఆయనను గూర్చి పాటలు పాడగలను.