“ప్రవక్తయైన యెషయా,” ఫ్రెండ్, 2026 డిసెంబరు , 46–47.
ఫ్రెండ్ నెలవారీ సందేశం, 2026 డిసెంబరు
ప్రవక్తయైన యెషయా
ఒక రోజు దేవాలయంలో, ప్రభువు యెషయాను ప్రవక్తగా ఉండమని పిలిచారు. యెషయా ఆ జనులను ప్రేమించాడు మరియు వారిని క్రీస్తు ఏవిధంగా రక్షించగలడో వారికి బోధించారు.
తన జనులను పాపము నుండి రక్షించడానికి యేసు క్రీస్తు ఒకరోజు వస్తారని యెషయా నేర్చుకున్నాడు. కానీ అందరూ ఆయనను తమ రక్షకునిగా గుర్తించరు. అనేకమంది జనులు యేసు క్రీస్తును నమ్మరని తెలుసు గనుక యెషయా విచారించాడు.
కానీ యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి కూడా యెషయా ప్రవచించాడు. ఒక రోజు ఆయన తిరిగి వచ్చి, సమస్త భూమికి రాజు అవుతాడు. ఆయన దయను, శాంతిని శాశ్వతంగా తీసుకురావడం ద్వారా తన తండ్రి సంకల్పాన్ని నెరవేరుస్తారు. యేసు క్రీస్తు వారి రక్షకుడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారని యెషయా చెప్పాడు.
రంగులువేసే పేజీ
యేసు క్రీస్తు బేత్లెహేములో జన్మించారు.
ఆడ్రీ డే చేత దృష్టాంతాలు. సంఘ ఉపయోగం కోసం మాత్రమే నకలు చేయవచ్చు.
మీరు రక్షకుని జననాన్ని ఎలా జరుపుకుంటారు?
© 2026 by Intellectual Reserve, Inc. All rights reserved. అ. సం. రా.లలో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Friend Message, December 2026 యొక్క అనువాదము. Telugu. 20036 421