“రూతు మరియు నయోమి,” ఫ్రెండ్ , 2026 సెప్టెంబరు, 46–48.
నెలవారీ ఫ్రెండ్ సందేశం, 2026 సెప్టెంబరు
రూతు మరియు నయోమి
నయోమి కుటుంబం యూదాలో నివసించేది. కరువు కారణంగా వారికి తగినంత ఆహారం లేకపోవడంతో, వారు మోయాబుకు తరలివెళ్లారు.
మోయాబులో నయోమి భర్త చనిపోగా, ఆమె కుమారులు ఓర్పా మరియు రూతు అనే స్త్రీలను వివాహం చేసుకున్నారు. వారు 10 సంవత్సరాలు నయోమిని జాగ్రత్తగా చూసుకున్నారు. తరువాత ఓర్పా మరియు రూతుల భర్తలు చనిపోయారు. ఇప్పుడు ఆ స్త్రీలు ఒంటరివారు అయ్యారు.
ఓర్పా తన ఇంటికి తిరిగి వెళ్ళింది. కానీ రూతు నయోమితో ఉండి, తనను జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంది. యూదా దేశములో మరలా పంటలు పండుతున్నాయని రూతు నయోమిలు విన్నారు, కనుక వారు అక్కడికి ప్రయాణించారు.
వారు పంట కోత సమయంలో వచ్చారు. నయోమి బంధువైన బోయజు పొలాలను కలిగియున్నాడు. అతడు రూతును తన పొలములో మిగిలిన ధాన్యము ఏరుకోనిచ్చాడు. అది చాలా కష్టమైన పని.
ఆమె కష్టపడి పనిచేస్తుంది, ఆమె నయోమికి మరియు ప్రభువుకు విధేయురాలిగా ఉన్నది కనుక బోయజు రూతును గౌరవించాడు.
రూతు తనను వివాహం చేసుకోమని బోయజును కోరింది. రూతు విధేయత మరియు సుగుణముగల స్త్రీ అని బోయజుకు తెలుసు. అతడు అంగీకరించాడు.
రూతు మరియు బోయజు వివాహం చేసుకుని ఒక మగబిడ్డను కన్నారు. అనేక సంవత్సరాల తరువాత, యేసు క్రీస్తు ఈ కుటుంబ వంశావళిలో జన్మించారు.
రంగులువేసే పేజీ
యేసు క్రీస్తు మూలంగా, నేను పశ్చాత్తాపపడి, శుద్ధి పొందగలను
ఆడ్రీ డే చేత వివరణలు. సంఘ ఉపయోగం కోసం మాత్రమే కాపీ చేయవచ్చు.
మంచి ఎంపికలు చేయాలని గుర్తుంచుకోవడానికి మీకు ఏది సహాయపడుతుంది?
© 2026 by Intellectual Reserve, Inc. All rights reserved. అ. సం. రా.లలో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Friend Message, September 2026 యొక్క అనువాదం. Telugu. 20073 421