2023
యేసు మనకు మార్గం చూపించారు
2023 ఆగష్టు


“యేసు మనకు మార్గం చూపించారు,” ఫ్రెండ్, ఆగష్టు 2023, 4--5.

2023 ఆగష్టు, ఫ్రెండ్ యొక్క నెలవారీ సందేశములు.

యేసు మనకు మార్గం చూపించారు.

చిత్రం
Alt text

డాన్ బర్ చేత వివరణలు

యేసు క్రీస్తు పరలోక తండ్రి యొక్క కుమారుడు. ఎదో ఒకరోజున పరలోక తండ్రి వద్దకు మనము ఎలా తిరిగి వెళ్ళగలమో మనకు చూపించడానికి ఆయన భూమి మీదకు వచ్చారు. యేసు బాప్తిస్మము తీసుకున్నారు. మనము కూడా బాప్తిస్మము పొందాలని ఆయన బోధించారు.

చిత్రం
alt text

ఎలా జీవించాలో రక్షకుడు మనకు చూపించారు. ఆయన ప్రతిఒక్కరిని ప్రేమించారు మరియు సహాయపడ్డారు. ఆయనను అనుసరించాలని మనల్ని కోరుతున్నారు.

చిత్రం
alt text

యేసు క్రీస్తు మన సమస్త బాధలను అనుభవించారు మరియు మన పాపముల కొరకు బాధపడ్డారు. తరువాత ఆయన మన కొరకు మరణించారు. ఇది యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త త్యాగమని పిలవబడింది. ఆయన పునరుత్థానము చెందారు. దానర్థము, ఆయన ఈ రోజు జీవిస్తున్నారు! యేసు క్రీస్తు వలన, మనము చనిపోయిన తరువాత కూడా తిరిగి జీవిస్తాము.

చిత్రం
alt text

యేసు మనల్ని ప్రేమిస్తున్నారు కనుక ఈ విషయాలన్నీ ఆయన మన కొరకు చేసారు. ఆయన వలన, ఎదో ఒక రోజు, మనం మన పరలోక తండ్రి మరియు మన కుటుంబాలతో కలిసి జీవించగలము.

చిత్రం
alt text

బాప్తీస్మము పొందుట ద్వారా మనము యేసు క్రీస్తును అనుసరించగలము. మనము ఇతరులను ప్రేమించి, సహాయపడి మరియు ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు మనము కూడా ప్రతిరోజు ఆయనను అనుసరించగలము.