2023
యేసు క్రీస్తు తుఫానును శాంతపరుస్తారు
2023 మార్చి


“యేసు క్రీస్తు తుఫానును శాంతపరుస్తారు,” ఫ్రెండ్, 2023 మార్చి, 46–47.

నెలవారీ ఫ్రెండ్ సందేశాలు, 2023 మార్చి

యేసు క్రీస్తు తుఫానును శాంతపరుస్తారు

చిత్రం
ఆయన శిష్యులు సముద్రాన్ని చూస్తున్నప్పుడు యేసు క్రీస్తు పడవలో నిద్రిస్తున్నారు

ఏప్రిల్ స్టాట్ చేత వివరణలు

ఒక రాత్రి యేసు క్రీస్తు మరియు ఆయన శిష్యులు ఒక పడవలో సముద్రం దాటారు. యేసు అలసిపోయి నిద్రించారు.

చిత్రం
యేసు మరియు ఆయన శిష్యులతో ఉన్న పడవను తిప్పుతున్న తుఫాను

ఒక తుఫాను వచ్చింది. అలలు పెరిగి పెద్దవయ్యాయి! శిష్యులు భయపడ్డారు. వారు యేసును లేపి, తమను రక్షించమని అడిగారు.

చిత్రం
తుఫానును శాంతపరుస్తున్న యేసు

యేసు లేచి నిలబడి, “నిశ్శబ్దమై ఊరకుండుము” అన్నారు. గాలి ఆగిపోయింది. నీరు ప్రశాంతంగా ఉంది.

చిత్రం
కళ్ళు మూసుకుని చేతులు కట్టుకున్న చిన్న బాలుడు

యేసు క్రీస్తు నందు నా విశ్వాసము నాకు శాంతిని కలిగించగలదు. నేను భయపడినప్పుడు, ప్రశాంతంగా ఉండేందుకు యేసు నాకు సహాయం చేయగలరు.

రంగులువేసే పేజీ

యేసు గురించి నేర్చుకోవడానికి నేను ఇష్టపడతాను

చిత్రం
యేసు గురించిన పుస్తకాన్ని చూస్తున్న బాలిక యొక్క రంగులువేసే పేజీ

పెట్రీషియా గీస్ చేత వివరణ

యేసు గురించి నీకు ఏమి తెలుసు?