2022
మోషే మరియు మన్నా
2022 ఏప్రిల్


“మోషే మరియు మన్నా,” నెలవారీ ఫ్రెండ్ సందేశాలు, 2022 ఏప్రిల్

“మోషే మరియు మన్నా”

ఫ్రెండ్ నెలవారీ సందేశము, 2022 ఏప్రిల్

మోషే మరియు మన్నా

చిత్రం
మోషే మరియు ఇశ్రాయేలీయులు

ఏప్రిల్ స్టాట్ చేత వివరణలు

మోషే ఒక ప్రవక్త. అతడు దేవుని యొక్క జనులను వాగ్దాన దేశము వైపు నడిపించాడు. వారు అనేక రోజులు నడిచారు.

చిత్రం
మన్నాతో పిల్లలు

జనులు ఆకలిగా ఉన్నారు. వారికి ఆహారం లేదు. దేవుడు వారికి పరలోకము నుండి ఆహారమును పంపారు. అది మన్నా అని పిలవబడింది.

చిత్రం
మన్నాను సిద్ధపరుస్తున్న కుమారుడు మరియు తల్లి

ప్రతీ ఉదయము, జనులు తినడానికి మన్నాను సేకరించారు. కానీ అది మరుసటి ఉదయము వరకు తాజాగా లేదు. వారు మరుసటి రోజు మరలా సేకరించాలి.

చిత్రం
పిల్లలతో యేసు క్రీస్తు

మన్నా మనకు యేసు క్రీస్తును జ్ఞాపకం చేస్తుంది. జనులను రక్షించడానికి దేవుడు మన్నాను పంపారు. ఆయన మనలను రక్షించడానికి యేసును కూడా భూమిపైకి పంపారు. మనకు ప్రతీరోజు ఆహారము అవసరమైనట్లుగా, ప్రతిరోజు యేసు మనకు అవసరము.

చిత్రం
యేసు క్రీస్తు యొక్క చిత్రమును చూస్తున్న పిల్లలు

నేను యేసును అనుసరిస్తాను. ఆయన నాకు బలమును ఇస్తారు మరియు ప్రతిరోజు ఆయన ప్రేమను అనుభవించడానికి నాకు సహాయపడతారు.

రంగులువేసే పేజీ

మనకు ప్రతీరోజు యేసు క్రీస్తు అవసరం

చిత్రం
పిల్లలతో యేసు క్రీస్తు

డౌన్లోడ్ చేయడానికి చిత్రపటముపై క్లిక్ చేయండి.

ఏప్రిల్ స్టాట్ చేత వివరణ

యేసు మీకు ఎలా సహాయపడతారు?