2022
కష్ట సమయాల కొరకు యోసేపు సిద్ధపడును
2022 మార్చి


“కష్ట సమయాల కొరకు యోసేపు సిద్ధపడును”ఫ్రెండ్ నెలవారీ సందేశము, 2022 మార్చి

“కష్ట సమయాల కొరకు యోసేపు సిద్ధపడును”

ఫ్రెండ్ నెలవారీ సందేశము, 2022 మార్చి

కష్ట సమయాల కొరకు యోసేపు సిద్ధపడును

చిత్రం
ఫరో ముందు యోసేపు

ఏప్రిల్ స్టాట్ చేత వివరణలు

యోసేపు ఒక ప్రవక్త. అతడు ఐగుప్తులో నివసించాడు. ఒకరోజు రాత్రి ఐగుప్తు రాజైన ఫరో ఒక కలగన్నాడు. అతడు యోసేపును ఆ కలకు అర్థమేమిటని అడిగాడు.

చిత్రం
ఖాళీ గిన్నెతో పిల్లవాడు

కలను అర్థం చేసుకోవడంలో యోసేపుకు దేవుడు సహాయపడ్డారు. ఏడేళ్లపాటు ప్రజలకు పుష్కలంగా ఆహారం అందుతుంది. తరువాత ఏడేళ్లపాటు వారికి లేమి కలుగుతుంది. ఫరోకు యోసేపు చెప్పాడు.

చిత్రం
ఐగుప్తులో ధాన్యం నిల్వ చేస్తున్న యోసేపు

ఇప్పుడు ఆహారాన్ని పొదుపు చేయాలని యోసేపు అన్నాడు. అప్పుడు వారు కష్ట సమయాలకు సిద్ధంగా ఉంటారు. ఆహారాన్ని పొదుపు చేసే బాధ్యతను ఫరో యోసేపుకు అప్పగించాడు. యోసేపు చాలా కష్టపడి పనిచేసాడు.

చిత్రం
ప్రజలకు ధాన్యం పంచుతున్న యోసేపు

ఏడు సంవత్సరాల కరువు వచ్చినప్పుడు, ప్రజలకు తినడానికి తగినంత ఆహారం ఉంది. వారు ఇతరులతో పంచుకోవడానికి కూడా సరిపోయింది.

చిత్రం
సంఘము వైపు నడుస్తున్న కుటుంబం

నేను ఇప్పుడు సిద్ధపడగలను. దేవుని సహాయంతో, నేను కష్ట సమయాలను అధిగమించగలను!

రంగులువేసే పేజీ

పరలోకపు తండ్రి కష్ట సమయాల్లో నాకు సహాయం చేస్తారు

చిత్రం
వీడ్కోలు పలుకుచున్న తోబుట్టువులు

డౌన్‌లోడ్ చేయడానికి చిత్రపటముపై క్లిక్ చేయండి.

ఏప్రిల్ స్టాట్ చేత దృష్టాంతం

పరలోకపు తండ్రి మీకు ఎప్పుడు సహాయం చేసారు?